అతి క్లిష్ట సందేహం!

ఒక ముస్లీముకొచ్చిన అతి క్లిష్టమైన సందేహం!

కొంతకాలం క్రితం ఒక ఇస్లామీయ వెబ్ సైటులో ఒక ప్రశ్నను చదివాను. నిజానికి అది తర్కబద్దంగా యదార్థహృదయంతో అలోచించగలిగే ప్రతి ముస్లీమును ఎంతో కలతపెట్టే ప్రశ్న. ఆ వెబ్ సైటులో పాఠకుల స్పందన భాగంలో ఆవేశపూరితసలహాలు మరియు  గుడ్డివిశ్వాసంతోకూడిన ప్రకటనలు తప్ప ఆ ప్రశ్నకు అర్థవంతమైన జవాబుగాని లేక తర్కబద్దమైన వివరణగాని ఇచ్చే ప్రయత్నం ఒక్కరుకూడా చేయలేదు. యదార్థంగా చెప్పలంటే ఆప్రశ్నకు ముస్లీములు జవాబు చెప్పలేకపోవడానికి కారణం వారికి జవాబు చెప్పే సత్తా లేక కాదు, కాని ఆ ప్రశ్నకు జవాబు చెప్పడమన్నది ఇస్లామీయ ధర్మం సత్యమని భావించే ఎవరివళ్ళా కాని పని అది. అయినా, ఈ ప్రశ్న కేవళము ఇస్లాము ధర్మాన్ని అనుసరించేవారికి మాత్రమే వర్తిస్తుందని అపోహపడకూడదు. ఇది ఆస్తిక వర్గానికి చెందిన అన్ని విశ్వాసాలకు వర్తించే ప్రశ్న. ఈ క్రింద యివ్వబడిందే ఆ ప్రశ్న:  

“ప్రస్తుతం నా అలోచనాసరళి గందరగోళంగా వుంది. ఒక వ్యక్తిని సృష్టించకముందే ఆ వ్యక్తి తన మరణానంతరం జన్నతుకు వెళ్ళబోతున్నాడా లేక నరకానికి వెళ్ళబోతున్నాడా అన్నది నిస్సంకోచంగా అన్నీ తెలిసిన (اَلْعَلِيْمُ/Al-Alim = All Knowing) అల్లాహ్ కు ముందే తెలుసి వుండాలి. అల్లాహ్ (الله‎/Allah) కు పైన వెరెవ్వరూ లేరు గనుక ఈ జ్ఙానం తనలోనుండే ఉద్భవించి ఉండాలి. అంటే, అలా జరగాలన్న నిర్ణయం అల్లాహ్ తానే చేసి వుండాలి. అయితే, అలాంటిది అల్లాహ్ కు వున్న రెండు నామాలతో పొసగలేదు: అనంత కరుణామయుడు (الرَّحِيمُ/Ar-Raheem = The Most Merciful) మరియు అత్యంత న్యాయవంతుడు (الْعَدْلُ/Al-Adil = The Most Fair/Just). ఒకవేళ ఒక ఫలాని వ్యక్తి సృష్టించబడితే ఆ వ్యక్తి తన మరణానంతరము నరకంలో నిత్యయాతనను అనుభవించబోతున్నాడు అన్న వాస్తవం అల్లాహ్ కు ముందే తెలిసి కూడా ఆవ్యక్తిని అల్లాహ్ సృష్టిస్తే ఇక అల్లాహ్ అనంత కరుణామయుడు ఎలా అవుతాడు…? ఒక అబ్దుల్లా విధిని నిత్యనరకంలో యాతనను అనుభవించాలని, ఒక అహ్మద్ విధిని జన్నతులో నిత్యసంతోషాలతో సుఖించాలని అల్లాహ్ *నిర్ణయిస్తున్నట్లయితే అల్లాహ్ అత్యంత న్యాయవంతుడెలా అవుతాడు…? అవును మనకు నిర్ణయస్వేచ్ఛ (Freewill) వుంది. కాని, అల్లాహ్ అన్నీ ముందే నిర్ణయించాడు కాబట్టి మన స్వేచ్ఛనుకూడా ఆయనే నియంత్రించడములేదని ఏలా చెప్పగలము…? ఈ ప్రశ్న నన్ను తీవ్రమైన మనస్థాపానికి మరియు కలతకు గురిచేస్తూ నా విశ్వాసానికే తీవ్రమైన ముప్పు తెచ్చిపెడుతున్నది!”    

పై సందేహానికి ముస్లీముగా మీ సమాధానమేమిటి…???

*[ఖురాను (సూరాహ్. 7:178-179; 10:99-100; 76:29-30; 81:28-29) మరియు హదీసులు (సహీ బుఖారి (4:54:430; 2:23:444; 6:60:473; 9:93:641) & సహీ ముస్లీము (33:6436; 33:6406)]

క్రైస్తవ విశ్వాసకోణంలోనుండి పై ప్రశ్నకు సమాధానం

దేవుడు – నిర్వచనం: సృష్టికర్త అయిన దేవుడు సర్వజ్ఙాని (Omniscient), సర్వవ్యాప్తి (Omnipresent), మరియు సర్వశక్తిమంతుడు (Omnipotent) [సహజ లక్షణాలు]. సృష్టికర్త అయిన దేవుడు అనంతుడు (Infinite), నిత్యుడు (Eternal), మరియు స్వయంభవుడు (Self-existent) [తాత్విక లక్షణాలు]. సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడు (Holy), న్యాయవంతుడు (Just), మరియు ప్రేమాస్వరూపుడు (Love) [నైతిక లక్షణాలు]. 

దేవుడు సర్వజ్ఙాని – వివరణ: జ్ఙానమంతా దేవునిది. వున్న జ్ఙానమంతా దేవుని వశం. తెలియబడగలిగినదంతా దేవునికి తెలిసు, కాని తెలియబడజాలనిది ఆయనకూడా తెలియదు! మరొక నిజమైన దేవున్ని సృష్టించడమెలాగో దేవునికి తెలియదు; తననుతాను నిర్మూలముచేసుకోవడమెలోగో దేవునికి తెలియదు; పాపము చేయడము అంటే తనకుతాను వ్యతిరేకముగా ప్రవర్తించడము, తానే ఎత్తలేని రాతిని సృష్టించడము, త్రిభుజవృత్తాన్ని రూపించడం, ఒకే వైపు వున్న నాణ్యాన్ని  తయారుచేయడం మొదలైనవి దేవునికి తెలియవు. దీనికిగల ప్రధాన కారణం ఇవన్నీ అర్థవంతమైన లేక తర్కబద్దమైన మాటలు కాదు. వీటి భావాన్ని ఊహించుకోవడముకూడా అసాధ్యమైన విశయం. ఇలాంటివాటిని తర్కశాస్త్రములో అంతర్గత అసాధ్యాలు (Intrinscically Impossible Things) అని పేర్కొంటారు. ఈ గ్రహింపును బట్టి నిజదేవునికి అన్నీ తెలుసు అంటే తెలిబడగలిగినవన్నీ ఆయనకు తెలుసు అని అర్థం. అంతర్గత అసాధ్యాలు లేక అర్థంలేనివి దేవునికి తెలియవు. అవికూడా దేవునికి తెలిసుంటాయి లేక తెలిసుండాలి అని భావించడం అజ్ఙానం. అస్తిత్వాలను మూడురకాలుగా విభజించవచ్చు–తప్పనిసరి అయిన అస్తిత్వం [స్వయంభవుడైన దేవుడు (Necessary Being)], సుసాధ్యమైన అస్తిత్వం [ఉనికిలోకి రావచ్చు మరియు ఉనికిలోనుండి వెళ్ళిపోవచ్చు (Possible Being)], మరియు అంతర్గతంగా అసాధ్యమైన అస్తిత్వం [వీటికి ఎక్కడా ఎప్పుడూ ఉనికిలేదు (Intrinscically Impossible Being)].        

సుసాధ్య అస్తిత్వాలన్నవి ఆధారభరిత అస్తిత్వాలు (Contingent Beings). అవి తప్పనిసరి అయిన అస్తిత్వంపై అంటే దేవునిపై ఆధారపడేవి. సుసాధ్య మైన వాటి ఉనికిని దేవుడు ఉద్దేశించి సృష్టించగలడు. దేవుడు ఉద్దేశించి సృష్టించగలిగేవన్ని తెలుసుకోబడగలిగేవి. కనుక, దేవుడు తాను ఉద్దేశించి సృష్టించిన అన్నింటిని–పదార్థం, సంఘటనలు, వ్యక్తులు, పాత్రలు, వస్తువులు మొదలైనవి–గురించిన జ్ఙానం ఉన్నవాడు.   

భవిశ్యత్తు విశయానికొస్తే, దేవుడు తాను ఉద్దేశించి పథకరచన చేసిన వాటన్నింటిని ఎరిగినవాడు, కాని ఆయన  ఉద్దేశించనివి ఆయన తలంపులోకూడా ఉనికినికలిగిలేవు గనుక అలాంటివాటిని ఆయన ఎరుగడు అన్నది ఇక్కడ మరవకూడదు.     

భ్యవిశ్యత్తు – వివరణ: భవిశ్యత్తు అన్నది ప్రస్తుతం ఒక వాస్తవ అస్తిత్వముగా ఉనికిలో లేదు. అది రాబోవు కాలములో వాస్తవ అస్తిత్వముగా ఉంటే దాని సృష్టికర్త దేవుడే అన్నది నిరాపేక్షమైన అంశం. కనుక తాను ఉద్దేశించి పథకరచన చేసిన భ్యవిశ్యత్తును తాను ఏవిధంగా ఉద్దేశించి పథకరచన చేసాడో అదేవిధంగా భవిశ్యత్తును దేవుడు ఎరుగును. భవిశ్యత్తులో నిర్ణయస్వాతంత్రము వున్న ప్రాణులను (నరులు మరియు దేవదూతలు) అంతేకాకుండా ఆ ప్రాణుల నిర్ణయాలను చర్యలను కూడా దేవుడు నిర్ధారించవచ్చు. అప్పుడే ఆయన వాటినికూడా ఎరిగడము అన్నది జరుగుతుంది. అలా కాకుండా ఒకవేళ దేవుడు తాను ఉద్దేశించి పథకరచనచేసిన నిర్ణయస్వేచ్చగల ప్రాణుల యొక్క నిర్ణయాలను, చర్యలను తాను నిర్ధారించకుండా విడిచిపెడితే వాటిని ఆయన ఎరుగడు. ఆరంకంగా భవిశ్యత్తులోని నిర్ణయస్వేచ్చగల ప్రాణుల నిర్ణయాలను చర్యలను అంతేకాకుండా కొన్ని సంఘటనలను కొన్ని పాత్రధారులనుకూడా ఆయన తాను నిర్దేశించకుండా వదిలిపెట్టే స్వాతంత్రము ఆయనకుంది. ఆరకంగా చేసిన సందర్భాలలో దేవుడు వాటిని ఎరుగడు.   

భవిశ్యత్తుకు సంబంధించిన వాటిలోని ఏవైనా దేవుడు నిర్ధారించకుండా వదిలిపెడితే అలాంటి శూన్య స్థానాలు వాటిసమయం సమీపించినప్పుడు దేవునిచేత లేక నిర్ణయస్వేచ్చగల ప్రాణులచేత పూరింపబడవచ్చు. ఆ శూన్య స్థానాలలో తెలుసుకోవడానికిగాని లేక తెలుసుకోబడగలిగేవిగాని ఏమీ లేవు. కనుక, వాటినిగూర్చిన జ్ఙానం దేవునికి ఉందా? అన్న ప్రశ్న అర్థములేని ప్రశ్న లేక అజ్ఙానపు ప్రశ్న. దేవునిచేత (సార్వభౌమత్వాన్నిబట్టి) లేక నిర్ణయస్వేచ్చగల (దేవుడిచ్చిన నిర్ణయస్వేచ్చనుబట్టి) ప్రాణులచేత నిర్ధారించబడే వరకు ఆ శూన్య స్థానాల యొక్క భవిశ్యత్తులోని వాస్తవికత అన్నది దేవుడు ఎరుగడు. 

ఒక వ్యక్తి మరణానంతరము నరకానికి వెళ్ళబోతున్నాడా లేక పరలోకానికి (జన్నత్) వెళ్ళబోతున్నాడా అన్నది దేవునికి ముందే తెలుసా? తెలియదు! కారణం, అది తెలిసుకునే అవకాశం లేదు. అంటే దేవుడైనా లేక ఆ వ్యక్తి అయినా దాన్ని ఇంకా నిర్ధారించలేదు. ఒకవేళ దేవుడు ఆ వ్యక్తి నరకానికి వెళ్ళాలి అని నిర్ధేశిస్తే అప్పుడే దేవుడు దాన్ని ఎరుగడం అన్నది సాధ్యం. అలాంటి నిర్ణయం అంటూ దేవుడు చేస్తే దాన్నిబట్టి ఆయన అన్యాయస్థుడు, ప్రేమలేనివాడు, మరియు చెడ్డవాడు అని అర్థంచేసుకోవాల్సి వస్తుంది. కాని, దేవుడు అలాంటివాడు కాదు. ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా అలాంటిది ఎప్పుడు చేయడు చేయజాలడు (హెబ్రీ.10:). కనుక పరలోకానికి వెళ్ళడమా లేక నరకానికి వెళ్ళడమా అన్న నిర్ణయాన్ని దేవుడు నిర్ణయస్వేచ్చతోకూడిన నరులందరికీ యిచ్చాడు. అందుచేత ప్రతివ్యక్తి తనకివ్వబడిన నిర్ణయస్వేచ్చనుబట్టి తలంపులద్వారా, మాటలద్వారా, మరియు చేతలద్వారా నిత్యత్వములో తాను ఎక్కడ ఉండబోతున్నది నిర్ధారించడం జరుగుతుంది. 

దేవునికి భవిశ్యత్తు తెలుసు అంటే దాని భావం దేవుడే భవిశ్యత్తు అలా వుండాలని నిర్ధేశించాడని. కనుక, ఇస్లాము ధర్మము ప్రకారం ఏవ్యక్తులు నరకానికి వెళుతునారోనన్నది అల్లాహ్ కు ముందే తెలుసు అన్నది వాస్తవమైతే దాని అర్థం ఆ వ్యక్తులు నరకానికి వెళ్ళడమన్నది అల్లాహ్ యే నిర్ధేశించాడని. నిజానికి ఇస్లామీయ సాహిత్యములో అంటే ఖురాను (సూరాహ్. 7:178-179; 10:99-100; 76:29-30; 81:28-29) ముఖ్యంగా హదీసులు (సహీ బుఖారి (4:54:430; 2:23:444; 6:60:473; 9:93:641) & సహీ ముస్లీము (33:6436; 33:6406)] ఈ భావాన్నే వ్యక్తపరుస్తున్నాయి. అయితే అలాంటి దేవుడు నిజదేవుడు కానేరడు. కారణం, అలాంటి దేవుడు న్యాయం మరియు ప్రేమ లేనివాడు మాత్రమేగాక అతను అతిగొప్ప దుష్టత్వానికి ప్రతిరూపం అన్నది అర్థమవుతుంది. అదృష్టవశాత్తు అలాంటి దేవుడు కొందరి ఊహాగానాలలో తప్ప అస్తిత్వంతోకూడిన ఉనికిలో లేడు. నిజానికి దైవగ్రంథమైన బైబిలు అలాంటి జ్ఙానాన్ని దేవునికి ఎక్కడా ఆపాదించడంలేదు. 

న్యాయం – వివరణ: దేవుడు తన సార్వభౌమత్వములో తన నిర్ణయస్వేచ్చను తొలగించుకోవడంద్వారా మనుషులకు (మరియు పరలోకములోని దేవదూతలకు) నిర్ణయస్వేచ్చను [freewill] అనుగ్రహించాడు. ఆరకంగా తన నిర్ణయస్వేచ్చను తొలగించుకునే అధికారం మరియు స్వేచ్చ అన్నవి దేవుని సార్వభౌమత్వములోని భాగం. ఆరకంగా ఇవ్వబడిన సంపూర్ణ నిర్ణయస్వేచ్చ వున్న సందర్భాలలోనే వ్యక్తులు తమ నిర్ణయాలకు మరియు చర్యలకు బాధ్యతవహించి తీర్పుతీర్చబడుతారు. పక్షపాతరహితంగా నిర్ణయస్వేచ్చ కలిగి వున్న వ్యక్తులను వారి నిర్ణయాలు మరియు చర్యల ఆధారంగానే వారికి తగినవిధంగా తీర్పుతీర్చడమన్నది ఇక్కడ న్యాయం అని గ్రహించాలి. శిక్షకు తగిన నేరం చేయకపోయినా శిక్షించడమన్నది అన్యాయం; చేయబడిన నేరానికి తగిన శిక్ష విధించకుండా క్షమించినా అది అన్యాయం (సామెతలు.17:15).                 

ప్రేమవివరణ: దేవుని నైతిక లక్షణాలు పరిశుద్ధత (యెషయా.6:1-3; ప్రకటన.4:8), న్యాయం (ద్వి.కాం.32:4; యెషయా.30:18; కీర్తన.89:14), మరియు ప్రేమ (ని.కాం.34:6; 1యోహాను.4:8,16). ఎవరూ నశించడము దేవుడు యిచ్చయించడు (1తిమోతి.2:3-6; యోహాను.3:16; రోమా.5:8) అన్నదానికిగల కారణము దేవుని ప్రేమ. ఈ లోకములో చేయబడిన పాపాలన్నింటికీ తగిన శిక్ష/వెలను కోరేది దేవుని న్యాయం. యదార్థంగా తమ పాపాలకు పశ్చాత్తాపపడి విశ్వాసముతో దేవుని సహాయము కోరేవారందరినీ రాబోవు తీర్పుదినాన కాపాడేనిమిత్తం దేవుడే తన నిత్యసంకల్పములోని ప్రణాలికనుబట్టి తన న్యాయం మరియు ప్రేమల ఆధారంగా పథకరచననుచేసి దాన్ని తానే నిర్వర్తించి మానవాళికి రక్షణ/మోక్షం సంపాదించిపెట్టాడు (ని.కాం.34:7; కీర్తన.145:9; అ.కా.10:34-35; రోమా.11:32; తీతుకు.2:11, 3:4; 1యోహాను.4:9-10). దేవుడే సంపాదించిపెట్టిన ఈ రక్షణ/మోక్ష మార్గాన్ని సిద్దపరచి దానికి తగిన వెల చెల్లించిందది దేవుడే (రోం.5:6-8; 18; 1యోహాను.2:1-2). మరొక విధంగా చెప్పాలంటే, దేవునిన్యాయం కోరిన వెలను దేవునిప్రేమ చెల్లించింది. ఏనరుడు తన పాపాలకు తగిన వెలను చెల్లించి మోక్షాన్ని/రక్షణను అంటే పాపక్షమాపణ మరియు నిత్యజీవము సంపదించలేడు (కీర్తన.49:7-9). రక్షణ లేక మోక్షము అన్నది దేవుడు తన కృపనుబట్టి అనుగ్రహిస్తున్న ఉచిత బహుమానము. దాన్ని కేవళము విశ్వాసముతోనేఅ అందుకోగలము (ఎఫెసీ.2:8-9).

బైబిలు (పాత మరియు క్రొత్త నిబంధన గ్రంథాలు) లో ప్రత్యక్షపరచుకున్న దేవుడు మరియు ఆయన గుణలక్షణాలే పై ప్రశ్నకు సరియైన సమాధానము. ఆయన  మాత్రమే గందరగోళంగా వున్న హృదయాలకు తన సత్యంతో సమాధానం అనుగ్రహించగలడు. దేవుడు మిమ్ములను దీవించి సర్వసత్యంలోకి నడిపించును గాక!