జన్నతుకు నాలుగు అడుగులు
ఈలోకములో పుట్టే ప్రతివ్యక్తి ఏదో ఒకరోజు తనువు చాలించాల్సిందే. మరణం అన్నది అందరు తప్పనిసరిగా పొందబోయే ఈలోకములోని చివరి అనుభవం. అయితే, మరణముతరువాతి జీవితముకొరకు ఏకొద్దిమందో సిద్ధపడటము జరుగుతుంది. ‘చావు అనేది నాకు ఇప్పుడే రాదు’ లేక ‘చావు గురించి నేను యిప్పుడు ఆలోచించాల్సిన పనిలేదు’ అన్న దృక్ఫథంతో ప్రతివ్యక్తీ జీవిస్తూ వుండటం సహజం.
రేపటికొరకు, రాబోయే సంవత్సరము కొరకు అలాగే పిల్లలు పెరిగి పెద్దవారయ్యే సమయముకొరకు ఎంతో చింతచేయటం అలాగే ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకోవటం ఇంకా వీలైనంతమట్టుకు వెనకేసుకు రావటమన్నవి సర్వసాధారణంగా సమాజములో ప్రతివ్యక్తీ చేయటం మామూలే. కాని, విజ్ఙతగల ప్రతిమనిషీ మరణం తరువాతి ఉనికినిగురించి చింతనచేసి ఆ వునికి సరియైన స్థలములో సరియైన విధానములో కొనసాగటానికి ఇప్పుడే ఈలోకములోనే తాను చేయగలిగినదంతా చేయాలి. ఈ లోకంలోని జీవితకాలాన్ని మరణంతరువాత గడుపబోయే కాలంతో పోలిస్తే అది లేశమాత్రమే నన్నది మరచిపోకూడదు.
ప్రవక్తలద్వారా యివ్వబడిన లేఖనాలు ఘోషిస్తున్నాయి, “నేడే అనుకూలసమయం, నేడే రక్షణదినం!”
“సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభ వించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.” (దానియేలు.12:2)
మరణం తరువాత రెండు ప్రదేశాలలో ఏదో ఒక దానిలో ప్రతివ్యక్తీ తన నిత్యత్వాన్ని గడపాలి. జన్నత్ (جنت) మరియు జహన్నం (جهنم). జన్నత్ అన్నది పరదైసు, జహన్నం అన్నది నరకం. జన్నతులోకి ప్రవేశించడానికి మన స్వంత నీతి (స్వనీతి) సరిపోదు. అలాగే, స్వంత ప్రయత్నాలతోకూడిన మన మతనిష్ఠకూడా సరిపోదు. అందుకు సరిపోయింది కేవలం సృష్టికర్తే నరులకొరకై నిర్ధేశించిన నాలుగు ఆత్మీయ అడుగులు!
జన్నతులోనికి ప్రవేశించే అర్హతను సిద్ధపాటును అందించే ఆ నాలుగు అడుగులను గురించిన వివరాలు తెలుసుకోవాలంటే క్రింది లింకును నొక్కండి…
జన్నతుకు (మోక్షానికి) వెళ్ళేందుకు వేసే మొదటి అడుగు…
[జన్నతులోనికి (మోక్షంలోకి) ప్రవేశించడానికి వేయాల్సిన నాలుగు (ఆత్మీయ) అడుగుల విశయములో మీకు సందేహాలున్నా లేక ఇంకా స్పష్టత కోరుతున్నా క్రింద ఉన్న కామెంటు బాక్సుద్వారా నైనా లేక మా Email ID <[email protected]> ద్వారానైనా మాకు వ్రాయండి.]